ప్రతీ వాహనాన్ని పరిశీలించాలి
తాండూర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీని పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు మనోహర్ సూచించారు. మంగళవారం మండలంలోని రేపల్లెవాడ శివారులో ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. పరిమితికి మించి డబ్బులు, అక్రమంగా మద్యం తీసుకెళ్లినా వెంటనే సీజ్ చేయాలని, ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్ జ్యోత్స్న, డీటీ కల్పన, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పద్మజ ఉన్నారు.


