జైపూర్‌లో రెండు పులులు
జైపూర్: జైపూర్ అటవీ ప్రాంత పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీ సెక్షన్ అధికారి రా మకృష్ణ సర్కార్ మంగళవారం తెలిపారు. వాటి పా దముద్రలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధి లోని అటవీ పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు పత్తి చేన్లకు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని తెలిపారు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక మామిడితోటలో, వేలా ల ఇసుక క్వారీ వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించామని చెప్పారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికా రులకు తెలుపాలని, దానికి హాని తలపెట్టవద్దని సూచించారు. పులి కదలికలపై నిఘా పెంచామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు. ట్రాక్ కెమెరాలు, మానవ వనరుల ద్వా రా పులి కదలికలను గమనిస్తున్నామని, పులిని ర క్షించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


