అందుబాటులో ఉండాలి
వేమనపల్లి: పోలింగ్‌రోజు ఉదయం నుంచి ఫలితాలు వెల్లడించేదాకా సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో అనిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర మందులు, 108 అంబులెన్స్, ఫస్ట్‌ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆర్బీఎస్కే సిబ్బంది కూడా పోలింగ్‌స్టేషన్లను సందర్శించనున్నట్లు తెలిపారు. ప్రోగ్రాం అధికారిణి అరుణశ్రీ, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి సబ్మిట్ అధికారి శ్రీనివాస్ పీహెచ్‌సీ వైద్యాధికారి అన్వేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


