సంస్కృతికి నిదర్శనం తెలంగాణ తల్లి
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ తల్లి అని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో కుటుంబంలో కొడుకు, కూతుళ్లలో ఆడబిడ్డకు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దీనిని భావిత తరాలకు అందించాలని సూచించారు.


