పంపిణీకి సిద్ధంగా ఎన్నికల సామగ్రి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని 12 గ్రామపంచాయతీల్లో నిర్వహించనున్న మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మూడు రూట్లలోని 106 పో లింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. డీపీవో వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో సాయివెంకటరెడ్డి పర్యవేక్షణలో ఎంపీవో లు, పంచాయతీ కార్యదర్శులంతా పోలీంగ్ కేంద్రా ల వారీగా విభజించారు. ముగ్గురు జోనల్ అధికా రుల పర్యవేక్షణలో బుధవారం 117 మంది ప్రిసైడింగ్ అధికారులు, 157 మంది ఇతర పోలింగ్ అధి కారులకు అందజేసే ఎన్నికల సామగ్రిని అందుబా టులో ఉంచారు. మూడు రూట్లలో ఎనిమిది బస్సులు, ఒక టాటా ఏస్, ఒక కారును పోలింగ్ అధికా రులకు రవాణాశాఖ ఆధ్వర్యంలో సమకూర్చారు.


