ప్రలోభాలకు గురిచేస్తే కేసులే..
ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్ర త చర్యలు చేపడుతున్నాం. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అభ్యర్థులు, వారి మద్దతుదారులు డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తూ దొరికితే కేసులు నమో దు చేస్తాం. జిల్లాలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించేవారిని, ఇతర నేరస్తులను, ఎన్‌డీపీఎస్ కేసులున్నవారిని గుర్తించాం. ఇప్పటివరకు జిల్లాలో 106 ఎన్‌డీపీఎస్ కే సులు నమోదు చేశాం. అక్రమంగా తరలిస్తున్న రూ.5.61లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. 481మంది పాత నేరస్తులను బైండోవర్ చేశాం. రౌడీ షీటర్లు, మాజీ మా వోయిస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాం. లైసెన్స్‌డ్ గన్‌లు డిపాజిట్ చేసుకున్నాం. దావత్‌లు, ఊరేగింపులు, సోషల్‌మీడియాలో అసత్యప్రచారాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. వెయ్యిమంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలోని 82 అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో రెండు, మూడో విడతల్లో ఎన్నికలు జరగనుండగా వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఇప్పటికే అక్కడి ప్రాంతాలన్నీ పోలీస్ పహారాలోకి వెళ్లిపోయాయి. మొదటి విడతలో 20 రూట్లు, రెండో విడతలో 39, మూడో విడతలో 26 రూట్లున్నా యి. పోలింగ్ కేంద్రాలన్నీ నిఘా నీడలో కొనసాగనున్నాయి. రామగుండం సీపీ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి.


