రేపే తొలి విడత పోలింగ్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లాలో 81 పంచాయతీ సర్పంచ్, 258 వార్డు స్థానాలకు ఎన్నికలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల రెవె న్యూ డివిజన్‌లో మొదటి విడత ఎన్నికలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం ప్ర చారం ముగియడంతో 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తా రు. తొలి విడతలో 90 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనుండగా ఇప్పటికే ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, మరో మూడు పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 81 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించనుండగా 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 816 వార్డులుండగా 34 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 268 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 514 వార్డులకు 1,476 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పోలింగ్‌కు అధికారులు సిద్ధం
తొలివిడత ఎన్నికల్లో 829 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవో), 1,071 మంది ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవో) పాల్గొంటున్నారు. 35మంది స్టేజ్–2 ఆర్వోలతో పాటు 20 మొబైల్ అబ్జర్వర్లు, 26 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా ఎన్నికల్లో భాగస్వాములవుతున్నారు. ఇక ఈ ఎన్నికలకు 53 బస్సులు, 17 కార్లు, తొమ్మిది టాటా ఏస్ వాహనాలను డీటీవో గోపీకృష్ణ ఆధ్వర్యంలో సమకూర్చారు.
మొదలైన ప్రలోభాల జోరు
ఈ నెల 11న నిర్వహించనున్న తొలివిడత ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రచారం ముగించి ఇక ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు మందు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. నగదు, నజరానాలు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొంటున్నారు.
మండలాలవారీగా ఓటర్ల వివరాలు
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
దండేపల్లి 20,486 21,614 1 42,101
హాజీపూర్ 8,361 8,593 0 16,954
జన్నారం 21,670 22,740 2 44,412
లక్సెట్టిపేట 12,261 12,966 0 25,227
మొత్తం 62,778 65,913 3 1,28,694


