నెన్నెలలో పోలీసుల కవాతు | - | Sakshi
Sakshi News home page

నెన్నెలలో పోలీసుల కవాతు

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

నెన్నెలలో పోలీసుల కవాతు

నెన్నెలలో పోలీసుల కవాతు

నెన్నెల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా మైలారం, నెన్నెల గ్రామాల్లో శుక్రవారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్‌ సీఐ హనోక్‌, నెన్నెల, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్‌, రామకృష్ణ, ఆలీ, పోలీసులు పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

మందమర్రిరూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని రౌడీషీటర్లను సీఐ శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సర్కిల్‌ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ప్రజలను బెదిరింపులపై ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్‌, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement