దివ్యాంగులను ప్రోత్సహించాలి
శ్రీరాంపూర్: దివ్యాంగులను ప్రోత్సహించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలోని సీఈఆర్ క్లబ్‌లో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని తెలిపారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, స్పోర్ట్స్ గౌరవ కార్యదిర్శి పాల్ సృజన్, కోఆర్డినేటర్ నరసయ్య, ఇండోర్ కేప్టెన్ తోట సురేశ్ పాల్గొన్నారు.


