పోలీసుల ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: స్థానిక సంస్థల ఎన్నికలు, డిసెంబర్ 6 నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, పాతమంచిర్యాల, ఏసీపీ శివారులో బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించారు. అనుమానితుల పేర్లు, సెల్‌నంబరు, ఆధార్ నంబరు, వివరాలు సేకరించారు. వాహనాలు, ప్రయాణికుల లగేజీ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


