నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
జైపూర్/భీమారం: జిల్లాలోని జైపూర్, మిట్టపల్లి, భీమారం, బూర్గుపల్లి గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు పి.మనోహర్ శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాలను తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ, రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు పాల్గొన్నారు.


