చికిత్సపొందుతూ మృతి
చికిత్సపొందుతూ మృతి
లక్సెట్టిపేట: మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన అంబడి రాజలింగు (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజలింగు గత నెల 5న ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో ఇటిక్యాల సమీపంలో లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు ఉన్నారు. భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కార్తిక్ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఈజ్‌గాం ఎస్సై కల్యాణ్ తెలిపారు. ఆయన తె లిపిన వివరాల ప్రకారం.. కార్తిక్ ద్విచక్రవాహనంపై గన్నారం నుంచి ఆరెగూడకు వస్తుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.