పంచాయతీల్లో మేనిఫెస్టోలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామానికి 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా సొంత ఖర్చులతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోను అభ్యర్థి మాధవరపు శ్రీలత ప్రకటించారు. వైకుంఠరథం ఏర్పాటుతోపా టు యువత ఉన్నత కొలువులు సాధించేలా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పలు హామీలతో ఓ మేనిఫెస్టోను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొదటి, రెండో విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారిని గెలిపిస్తే చేపట్టనున్న పనులను మేనిఫెస్టోల రూపంలో ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి మేనిఫెస్టోలపై కథనం.. – లక్ష్మణచాంద
గుడ్ మార్నింగ్ లక్ష్మణచాంద అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామంలోని వీధులను ఉదయం సందర్శిస్తానని సర్పంచ్ అభ్యర్థి ఓస కవిత తెలి పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
– ఓస కవిత, లక్ష్మణచాంద సర్పంచ్ అభ్యర్థి
అంబులెన్స్.. వైకుంఠ రథం.. డిజిటల్ లైబ్రరీ..


