అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో సంతానం నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్ల లుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగించింది. ఎంతమంది పిల్లలున్నా పోటీకి అర్హులేనని స్పష్టం చేసింది. అధిక జనాభాను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చాలామంది కోల్పోయారు. ప్రస్తుతం ఈ నిబంధన తొలగిపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగినవారికి అవకాశం దక్కగా వారు బరిలోకి దిగుతున్నారు.
వేరే వాళ్లకు పనిచేశాను
గత ప్రభుత్వాలు ఇద్దరు పిల్లల నిబంధన పెట్టడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాను. ఇతరుల గెలుపు కోసం పనిచేశాను. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేయడం, రిజర్వేషన్ కలిసిరావడంతో పోటీలో ఉన్నాను.
– రెడ్డి లక్ష్మీనరేందర్,
ఎక్బాల్‌పూర్, ఖానాపూర్ మండలం
ఈసారి అవకాశం దక్కింది
ప్రజాసేవ చేయాలని నా కోరిక. గత ఎన్నికల్లో పాండ్వాపూర్ పంచాయతీని జనరల్ మహిళకు కేటాయించగా ముగ్గురు పిల్లల నిబంధనతో పో టీ చేయలేదు. ఈ నిబంధన ఎత్తివేయడం, ఎ స్టీ రిజర్వేషన్ రావడంతో అవకాశం దక్కింది.
– రాథోడ్ మాణిక్‌రావు,
పాండ్వాపూర్, కడెం మండలం
శుభ పరిణామం
నాకు ముగ్గురు పిల్ల లున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉన్నా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రభుత్వం ఆ నిబంధన తొలగించడం శుభపరిణామం. చాలామందికి పోటీచేసే అవకాశం దక్కింది. – బోధనపోల్లా సాయవ్వ, బోరిగం, తానూరు మండలం
రిజర్వేషనూ కలిసొచ్చింది
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం హర్షణీయం. ఈ నిబంధన కారణంగా చాలా ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయాను. ఇప్పుడు నిబంధన ఎత్తివేయడంతోపాటు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ నాకు కలిసి వచ్చింది. – మామిడిపల్లి భీమేశ్,
కొండుకూరు పంచాయతీ
అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది
అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది
అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది
అడ్డంకి తొలగింది.. అవకాశం దొరికింది


