‘మహా’శివలింగం
నిర్మల్ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం 106 టైర్ల భారీ ట్రక్కుపై 35 అడుగల ఎత్తు, 10 అడుగుల వెడల్పు, 200టన్నుల బరువు గల భారీ శివలింగాన్ని తరలించారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోగల వట్టినాడు గ్రామ పరిధిలో దీనిని తయారు చేయించి బిహార్‌లోని ఉత్తర చంపారన్ జిల్లా మహావీర్ మందిర్ ట్రస్ట్ (పాట్నా) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ మందిరంలో ప్రతిష్ఠించేందుకు దీనిని తీసుకువెళ్తున్నారు. ఈ భారీ శివలింగంపై 1,008 శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. 2015లో ఆర్డర్ ఇవ్వగా 2022 నుంచి 2025 నవంబర్ 19 వరకు దీనిని తయారు చేసినట్లు తెలిసింది. కొండాపూర్ బైపాస్ వద్ద ట్రక్కు ఆగి ఉండగా మహా శివలింగాన్ని చూసేందుకు అధికసంఖ్యలో జనం తరలివచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


