భూ సేకరణకు నిధులివ్వండి
ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు ఆదిలాబాద్‌కు త్వరలోనే ఎయిర్‌బస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖం ‘కొరటా– చనాఖా’ను జాతికి అంకితం చేస్తాం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తాం ఆదిలాబాద్ సభకు తరలివచ్చిన జనం ‘హస్తం’ శ్రేణుల్లో జోష్
కొరటా– చనాఖా ప్రా జెక్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. పంటచేలకు రోడ్లు వేసేలా పొ లంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూపు తూ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
సమస్యలపై సమీక్ష నిర్వహించాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్‌వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లేదు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్‌పో ర్టు భూ సేకరణకు జీవో జారీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్
వేదికపై రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి, వివేక్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు, వినోద్, జిల్లా అధికారులు
అన్నివర్గాల ప్రజలకు న్యాయం
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తోంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులిచ్చాం. పేదలు దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని గుర్తించి వారి కడుపునింపేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలిచి ఆశీర్వదించాలి.
– పి.సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ప్రభుత్వం రూ. లక్ష ల కోట్ల అప్పులు న్నా.. ప్రతీ నెలా రూ.కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు రూపాయి ఖర్చులేకుండా కార్పొరేట్‌స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరా కు రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని రైతులకు అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా తీర్చిదిద్దుతాం.
– జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
ప్రజలకు అభివాదం
చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎ దురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టను న్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలకు సంబంధించి సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం
ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం రేవంత్‌రె డ్డి గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని తెలి పారు. త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్‌బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇది తన సూ చనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యా క్టరీని ప్రైవేట్ సెక్టార్‌లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖా ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించి జా తికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేసినట్లు వివరించారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
భారీ బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అ రెస్ట్‌లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొ రపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకుముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.
యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు
అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. బీఆర్‌ఎస్ పాలనలో అమలు కానీ అనేక పథకాలను ప్రజల కు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
భూ సేకరణకు నిధులివ్వండి
భూ సేకరణకు నిధులివ్వండి
భూ సేకరణకు నిధులివ్వండి
భూ సేకరణకు నిధులివ్వండి
భూ సేకరణకు నిధులివ్వండి


