ఆర్వో, ఎస్సైని తొలగించాలి
మంచిర్యాలటౌన్: అధికార పార్టీకి పూర్తి మద్దతుగా నిలుస్తూ ఎన్నికల కోడ్, నిబంధనలు తుంగలో తొక్కిన దండేపల్లి ఎస్సై, ఎన్నికల అధికారిని విధుల నుంచి తొలగించాలని మా జీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పాతమామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మాధవిని బీఆర్‌ఎస్ బలపరచగా ఆమె వేసిన నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించా రు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కార్యాలయంలోని వెనుక డోరు నుంచి మాధవి తో నామినేషన్ విత్‌డ్రా చేయించారని తెలిపా రు. అడ్డుకున్న తమ పార్టీ నాయకులను ఎస్సై భయపెట్టి కేసులు నమోదు చేస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే తాను కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడగా, గడువులోపే విత్‌డ్రాకు వచ్చారని, ఆ తర్వాత రీవెరిఫికేషన్ కోసమే పిలిచినట్లు తనకు మెసేజ్ పెట్టినట్లు తెలిపారు. దీనిపై పూర్తి ఆధారాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకరులతో సమావేశంలో మాజీ ప్ర జాప్రతినిధులు, బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


