గొడవలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్టు | - | Sakshi
Sakshi News home page

గొడవలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్టు

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

గొడవలకు పాల్పడే  రౌడీ షీటర్లపై పీడీ యాక్టు

గొడవలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్టు

బెల్లంపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవకు పాల్పడినా రౌడీ షీ టర్లపై పీడీ యాక్టు పెట్టడానికి వెనుకాడబోమ ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ హెచ్చరించా రు. గురువారం బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ కా ర్యాలయ ఆవరణలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. బెదిరింపులకు పాల్పడటం, గుంపులుగా తిరగడం, పోటీ చేసే అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడం, మద్యం, డబ్బులు, బ హుమతుల పంపిణీలో పాల్గొనడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొన్నారు. పోలింగ్‌బూత్‌ల వద్ద కలహాలు సృష్టించడం లాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్‌, వన్‌టౌన్‌, తాండూర్‌ సీఐలు సీహెచ్‌ హనోక్‌, కె.శ్రీనివాసరావు, ఎన్‌.దేవయ్య సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement