రోశయ్య సేవలు చిరస్మరణీయం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సే వలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ కొని యాడారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోశయ్య వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కిషన్, దుర్గాప్రసాద్, పురుషోత్తం నాయక్, హన్మంత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో..
మంచిర్యాలక్రైం: ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, గవర్నర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా, ప్రజాసేవకుడిగా దీర్ఘకా లం సేవలందించిన కొణిజేటి రోశయ్య రాజనీతి భావితరాలకు స్ఫూర్తి అని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతిని పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం వర్ధంతి నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రోశయ్య రాజకీయ ప్రస్థానం, నిస్వార్థ ప్రజాసేవ, సాదాసీదా జీవన పద్ధతి, పరిపాలనా నైపుణ్యం తదితర అంశాలను స్మరించుకున్నారు. ప్రజలకు అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, వివిధ వింగ్స్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సీపీవో సిబ్బంది, వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోశయ్య సేవలు చిరస్మరణీయం


