పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సర్పంచ్, వార్డు స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్య వహరించాలని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలో 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 268 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. 72 వెబ్ కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 26 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాల ఎన్నికలకు మొదటి విడతలో ఆరు చోట్ల ఏకగ్రీవం కాగా, మూడు స్థానాలకు నామినేషన్లను రాలేదని తెలిపారు. 81స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
భీమారం: మండలంలో బూర్గుపల్లి, భీమారం, కా జీపల్లిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్ సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూ చించారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు అందించిన పత్రాలు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తరువాత వచ్చే నామినేషన్లు తీసుకోకూడదని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను సందర్శించారు. విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అదనపు ఎన్ని కల అధికారి మధుసూదన్, సీఐ నవీన్ ఉన్నారు.


