ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు
లక్సెట్టిపేట: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువా రం మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్‌హాల్‌లో దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం మండలాల స ర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓటర్లకు ఓటు వేసే స్వేచ్ఛ ఇ వ్వాలని, ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని, ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ఎ న్నికల పరిశీలకుడు మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూ చించారు. అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించా రు. ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్ అధికారులున్నారు.


