గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. సామ్‌సాంగ్ ప్లాజా షోరూం వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అదించారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు ఎరుపు రంగు చొక్కా, గల్లలుంగీ ధరించి ఉన్నాడు. సుమారు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 8712656534 నంబర్‌లో సంప్రదించాలని సీఐ సూచించారు.
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
నిర్మల్‌టౌన్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ప్రియదర్శిని నగర్ కాలనీలో నివాసముంటున్న విజయ్‌కుమార్ (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన భార్య సౌభాగ్య వచ్చేసరికి మృతి చెంది కనిపించడంతో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సాత్నాల: మండలంలోని మేడిగుడ(ఆర్) గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. సీ డాం యాదవ్‌కు చెందిన ఇంట్లో బుధవారం ఉద యం షార్ట్‌సర్క్యూట్ జరగడంతో కూలర్‌కు మంటలు అంటుకున్నాయి. నిత్యావసరాలతో పాటు బట్టలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడికి గతంలో పక్షవాతం వచ్చి చేయి, కాలు పనిచేయడం లేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జాదవ్ రామారావు పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
బాలిక ఆచూకీ లభ్యం
వేమనపల్లి: బాలిక అదృశ్యమైన గంటల వ్యవధి లోనే నీల్వాయి పోలీసులు ఆచూకీ కనిపెట్టి తల్లి చెంతకు చేర్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గోవింద్‌గావ్ గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్, మమత దంపతుల కుమార్తె అంజలి వేమనపల్లి మండలంలోని దస్నాపూర్‌లో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. వారం రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం ఇంటినుంచి వెళ్లిపోయింది. తాత నాయిని భీమయ్య నీ ల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై జ గదీష్‌రెడ్డి ఆచూకీ కోసం ఆరా తీశారు. మధ్యాహ్నం కొత్తగుడిసెల కాలనీలోని సమీప బంధువు ఇంటివ ద్ద బాలిక కనిపించడంతో తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను అప్పగించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


