సర్పంచ్‌గా నాడు భార్య.. నేడు భర్త
తాంసి: ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్‌లు వేస్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని లీమ్‌గూడలో గిరిజనులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన తొడసం జైవంతబాయిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి రిజర్వేషన్‌లో భాగంగా ఎస్టీ జనరల్ కేటాయించగా ఆమె భర్త తొడసం శంభు నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.
మహిళా సర్పంచ్ అభ్యర్థిపై దాడికి యత్నం
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహిళా అభ్యర్థిపై దాడికి యత్నించినట్లు తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. చాకేపల్లి జీపీ ఎస్టీ మహిళా స్థానానికి రిజర్వు కాగా జంబి మౌనిక సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసింది. తన తరుపున వార్డు సభ్యురాలిగా నాయిని భాగ్యచేత నామినేషన్ వేయించింది. భాగ్య భర్త కృష్ణకు ఇష్టం లేకపోవడంతో మంగళవారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. అక్కడి నుంచి మౌనిక ఇంటికి వచ్చారు. తమ మధ్య గొడవకు మౌనికనే కారణమని భావించి కృష్ణ బావమరిది జంబి పోషం కోపంతో మౌనిక, ఆమె భర్త జంబి నరేష్ దాడికి యత్నించాడు. బాధితులు తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సర్పంచ్‌గా నాడు భార్య.. నేడు భర్త


