విత్‌డ్రాలో హైడ్రామా!
దండేపల్లి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. మండలంలోని మామిడిపల్లి సర్పంచ్ ఏకగ్రీవంపై రాత్రి వరకు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్తపు వైష్ణవి, బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన గుర్రాల మాధవి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఉప సంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండగా 4 గంటల తర్వాత మాధవి నామినేషన్ ఉపసంహరణ కోసం వెళ్లింది. దీంతో అక్కడున్న బీఆర్‌ఎస్ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. సమయం అయిపోయిన తర్వాత ఎలా ఉప సంహరించుకుంటారని ప్రశ్నించారు. 3 గంటలలోపే ఉపసంహరణకు దరఖాస్తు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. దరఖాస్తు చూపాలంటూ ఇరుపార్టీల నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మామిడిపల్లి సర్పంచ్‌గా ఎల్తపు వైష్ణవిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు.
ఒత్తిళ్లకు తలొగ్గి ఏకగ్రీవం
మామిడిపల్లి సర్పంచ్ ఏకగ్రీవంలో అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. ఉపసంహరణ సమయం దాటిన తర్వతా ఆమోదించడం సరికాదన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
విత్‌డ్రాలో హైడ్రామా!


