జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్‌రూరల్: ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రోల్ ప్లే’ కాంపిటీషన్ పోటీల్లో జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీనిధి, టి.శ్రీహిత, డి.అభిజ్ఞ హిత, ఏ.శ్రీ చందన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరుగనున్న నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొననున్నారు. సదరు విద్యార్థినులను బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డేనియల్, ఏటీపీ సారిక, గైడ్ టీచర్ దేవేందర్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పన, మేరీ, సునీత, కావ్య, తదితరులు పాల్గొన్నారు.
విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక
ఆదిలాబాద్: ప్రతిష్టాత్మక విజయ్ మర్చంట్ ట్రోఫీకి జిల్లా క్రికెటర్ కశ్యప్ పటా స్కర్ ఎంపికయ్యాడు. ప్ర స్తుతం విదర్భ క్రికెట్ అసో సియేషన్ తరపున ప్రాతి నిధ్యం వహిస్తున్న కశ్యప్ ఈ ట్రోఫీకి వరుసగా రెండోసారి ఎంపికకావ డం విశేషం. గతేడాది సైతం ఈ టోర్నీకి ప్రాతి నిధ్యం వహించాడు. బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ ట్రోఫీకి ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికై న మొదటి క్రికెటర్ కశ్యప్ కావడం గమనార్హం. ఈ సీజన్లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌పై 60, మహారా ష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌పై 113, బరోడా క్రికెటర్ అసోసియేషన్‌పై 57 పరుగులు సాధించాడు. అండర్–16 విభాగంలో నిలకడైన ఆటతీరుతో ట్రోఫీకి మరోసారి ఎంపికైనట్లు శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


