చిత్రహింసలు పెట్టి చంపేయాలి..!
నంబాల బాలిక ఎంత నరకం అనుభవించిందో అంతకంటే రెండింతల నరకం వారికి చూపించి, బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీయాలి. వీరి చావును చూసిన వారి వెన్నులో వణుకు పుట్టాలే. అప్పుడే మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పడుతాయి. ఇతర దేశాల మాదిరిగా చట్టాలు అమలు చేయాలి. దిశకు ఒక రూలు, చిన్నారికి ఒక రూలా.! – రాజేఽశ్వరి,
పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్, మంచిర్యాల
కఠినంగా వ్యవహరించాల్సిందే..
రేపిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలి. అప్పుడే ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ముఖ్యంగా మగపిల్లలను తమ తల్లిదండ్రులు నైతిక విలువలతో పెంచాలి. దోషులను కఠినంగా శిక్షించడం ఎంత ముఖ్యమో బాధితులకు రక్షణ కల్పించడం అంతే ముఖ్యం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
– తాళ్లపల్లి కవిత, సైకాలాజిస్టు, వనిత వాక్కు ఫౌండేషన్ కో ఫౌండర్, మంచిర్యాల
కాలయాపన చేయొద్దు
నిందితులను కోర్టు, జై లు విచారాణ అంటూ ల క్షలు ఖర్చు చేసి చేయడ ం కంటే దిశ కేసు తరలో న్యాయం చేయాలి.మహిళల జోలికి వెళ్తే కఠినంగా శిక్షిస్తారనే భయం ఉండాలి. దేశంలో ఆర్డినెన్స్ తెచ్చినా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. లెంగిక దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలి. సమాజంలో మార్పు కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, మహిళా సంఘాలు కృషి చేయాలి.
– అరుణ, పీవోడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్
చిత్రహింసలు పెట్టి చంపేయాలి..!
చిత్రహింసలు పెట్టి చంపేయాలి..!


