రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన
జైపూర్: మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పి.మనోహర్ పలు కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. జైపూర్, ఇందారం, షెట్‌పల్లి పంచాయతీ కార్యాలయాల్లోని కేంద్రాలను తనిఖీ చేసి ఆర్‌వోలకు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ, రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, నామినేషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తతో పని చేయాలని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు పాల్గొన్నారు.


