ఓపెన్‌కాస్ట్ వస్తేనే ఆర్‌కేపీ అభివృద్ధి
ఓసీ ఏర్పాటుకు సహకరిస్తాం
పునరావాసం కల్పించకపోతే అడ్డుకుంటాం
ఓసీ ప్రభావిత ఆర్‌కే4 గడ్డ ప్రజలు
నల్లబ్యాడ్జీలతో హాజరు
సజావుగా ప్రజాభిప్రాయసేకరణ
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్‌లో చేపట్టనున్న ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్–2 కోసం స్థానిక ఓసీ ఆవరణలో బుధవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగింది. స్థానిక ప్రజలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యూనియన్ ప్రతినిధులు ఓసీ ఫేజ్–2కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఓసీకి ఆనుకునే ఉన్న బీజోన్ ఆర్‌కే4 గడ్డ ప్రాంతవాసులు సభా ప్రాంగణానికి నల్లబ్యాడ్జీలతో హా జరయ్యారు. సభలోనికి రాకముందు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశా రు. గతంలో ఓసీ ఫేజ్–1 సందర్భంగా సింగరేణి అధికారులు తమ కాలనీవాసులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఓసీ బ్లాస్టింగ్‌ల్లో ఇ ళ్లు శిథిలమయ్యాయని, అనేక మంది శ్వాసకోశ రో గాలబారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ ఫేజ్–2కు సహకరిస్తామని, సుమారు 350 కుటుంబాలు గల ఆర్‌కే4 గడ్డ ప్రాంతవాసులకు సింగరేణి యాజమాన్యం పునరావాసం కల్పించి ఆర్‌అండ్‌ఆ ర్ ప్యాకేజీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఓసీ ఏర్పాటును అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన సభలో 48 మంది సలహాలు, సూచనలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతీ ఒక్క రి అభిప్రాయాలను నమోదు చేశామని అన్నారు. పునరావాసం కల్పించాలనేది ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నిబంధనల మేరకు సింగరేణి అధికారులు ప్రత్యామ్నాయం చూడాలని, ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేలా చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్‌కాస్ట్ వస్తేనే ఆర్‌కేపీ అభివృద్ధి


