ఆత్మస్థైర్యం నింపేందుకే పోటీలు
మంచిర్యాలక్రైం: దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య (రెవెన్యూ) తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల మైదా నంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ని ర్వహించిన ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల పోటీల తో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, దివ్యాంగులు ప్ర తి ఒక్కరూ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలి పారు. రన్నింగ్, షాట్‌ఫుట్, చెస్, బదిరులకు రన్నింగ్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు షార్ట్‌ఫుట్, క్యారం, జావెలిన్ త్రో, బుద్ధి మాంద్యం, దివ్యాంగులకు రన్నింగ్, షార్ట్‌ఫుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా యువజన క్రీడాలశాఖ అధికారి హన్మంత్‌రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికా రి పురుషోత్తంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


