సైబర్ మోసాల నియంత్రణకు చర్యలు
మంచిర్యాలక్రైం: సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ నూతన ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ ‘ఫ్రాడ్ క ఫుల్‌స్టాప్’ కార్యక్రమాన్ని తెలంగా ణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో టీజీసీ ఎస్‌బీ డైరెక్టర్ షీకా గోయల్ మంగళవారం జూమ్ లింక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో కమిషనరేట్‌లో ని పోలీస్ అఽధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘ఫ్రాడ్ క ఫుల్‌స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ సారథి 1930, స్కామ్‌సే బచావో, పైసా పైలం, హర్ స్క్రీన్ సురక్ష, మేరా లాగి మేరా రూల్, మహిళల రక్షణ, పిల్లల సంరక్షణ, హెల్ప్‌లైన్ 1930, గోల్డెన్ హవర్ రిపోర్టింగ్ ప్రా ముఖ్యత, ఏఐ ఆధారిత నివేదన వేగవంతం తదిత ర ఆంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతీ ఠాణా పరిధిలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రతీ కాలేజీ నుంచి ఇద్దరు సైబర్ వలంటీర్లను ఎంపిక చేయాలని, ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్‌ను టీమ్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. వీరితో కాలేజీల్లోనే కాకుండా పబ్లిక్ స్థలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సైబర్ నేరాల నియంత్రణ ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.


