సర్పంచ్‌గా భర్త, వార్డుమెంబర్‌గా భార్య..
● నామినేషన్ దాఖలు చేసిన దంపతులు
బెల్లంపల్లిరూరల్: మండలంలోని లంబాడితండా గ్రామ పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉండగా 686 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 332 మంది పురుషులు, 354 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని అన్‌రిజర్వుడ్ (సీ్త్ర లేదా పురుషులు)లకు, మొదటివార్డును అన్ రిజర్వుడ్ (మహిళ)కు కేటాయించారు. దీంతో లంబాడితండాకు చెందిన సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్ సర్పంచ్ అభ్యర్థిగా, అతని భార్య జీళ్ల రజిత మొదటి వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.


