5 క్వింటాళ్ల పత్తి దగ్ధం
వేమనపల్లి: మండలంలోని రాజారం కుర్మగూడేనికి చెందిన జుంజు కొమురయ్య పత్తికి ప్ర మాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. బాధితుడు వేమనపల్లి శివారులో ఏడెకరాల చేను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల ఏరిన 11 క్వింటాళ్ల పత్తిని ఇంటి ముందు భద్రపరిచాడు. ఎదురింట్లో మల్లన్న దేవుని పట్నాలు ఉండగా అక్కడికి వెళ్లాడు. అంతలోనే పత్తి గడ్డకు నిప్పంటుకుంది. గమనించిన స్థానికులు మోటర్లు ఆన్ చేసి మంటలు ఆర్పివేశారు. ఘటనలో సుమారు 5 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.


