సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

Dec 3 2025 8:15 AM | Updated on Dec 3 2025 8:17 AM

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్‌ కిషన్‌, దేవ్‌కబాయి దంపతులకు ప్రతాప్‌సింగ్‌, కుబేర్‌సింగ్‌, అనార్‌సింగ్‌, రామ్‌లఖన్‌సింగ్‌ నలుగురు కు మారులు సంతానం. గతంలో జాదవ్‌ కిషన్‌ ఒకసారి సర్పంచ్‌గా, ముత్నూర్‌ ఎంపీటీసీగా, తల్లి ఏమాయికుంట సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి మరణానంతరం నాలుగో కుమారుడు లఖ న్‌సింగ్‌ గత ఎన్నికల్లో ఏమాయికుంట సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాడు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా రిజర్వేషన్‌ అనుకూలంగా రావడంతో నామినేషన్‌ దాఖలు చేశాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న సోదరులు జాదవ్‌ కుబేర్‌సింగ్‌, అనార్‌సింగ్‌ సర్పంచ్‌ పదవికి పోటాపోటీగా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఓటర్లు అయోమయస్థితిలో పడిపోయారు. అదేవిధంగా మండలంలోని హీరాపూర్‌ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఉపసంహరణకూ నిబంధనలు

నిర్మల్‌ఖిల్లా: ఇప్పటికే తొలివిడత నామినేషన్ల ప్ర క్రియ పూర్తయింది. బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు బుధవా రం చివరిరోజు. అయితే ఇప్పటికే తమతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర త్యేక నిబంధనలు పొందుపరిచింది. అభ్యర్థి తమ నామినేషన్‌ ఉపసంహరించుకోదల్చుకుంటే సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తు అందజేయాలి. తనంతట తానుగా ఉపసంహరించుకుంటున్నారని, ఎటువంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ప్రలోభాలు, ఇతరుల ప్రమేయాలు లేవని స్వచ్ఛందంగా స్వీయ ధృవీకరణను సమర్పించాల్సి ఉంటుంది. అయితే రిటర్నింగ్‌ అధికారి దీనికి సంతృప్తి చెందకపోతే క్షేత్రస్థాయిలో వి చారణ చేపట్టేందుకు కూడా అధికారాలు ఉన్నాయి.

గుర్తుల కేటాయింపు ఇలా..!

బోథ్‌: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంద డి జోరందుకుంది. తొలివిడత నామినేషన్లు, పరిశీలన పూర్తికాగా ఈ నెల 3న ఉపసంహరణ గడువు ముగియనుంది. తుది జాబితా ప్రకటించి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. రెండోవిడత 6న, మూడోవిడత 9న నామి నేషన్‌ ఉపసంహరణ అనంతరం గుర్తులు కేటా యిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్‌, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించింది.

తెలుగు అక్షర క్రమంలో..

పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ప్ర క్రియ పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా జ రుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లలో పే రును ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అరవింద్‌’ అనే పేరుతో నామినేషన్‌ వేసిన వారికి, ‘లక్ష్మి’ అనే పేరుతో నామినేషన్‌ వేసిన వారి కంటే ముందుగా గుర్తు కేటాయించేందుకు ప్రాధాన్యత ఉంటుంది. నామినేషన్‌ వేసే అభ్యర్థులు ఇంటిపేరును ముందుగా రాయాలా, లేదా పేరును రా యాలా అనేది తమ బ్యాలెట్‌ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది.

సర్పంచ్‌ల కోసం..

సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ కోసం 30 ప్రత్యేక గుర్తులను కేటాయించారు. ఈ గుర్తులను గులా బీ రంగు బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రిస్తారు. ఉంగ రం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌పేస్టు, స్పానర్‌ (పానా), చెత్తడ బ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వ జ్రం, బకెట్‌, డోర్‌హ్యాండిల్‌, టీ జల్లెడ, మంచం, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బిస్కెట్‌, వేణువు, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్‌ స్టంప్స్‌ వంటివి ఉన్నా యి. ’నోటా’ గుర్తు కూడా అందులో ఉంటుంది.

వార్డు అభ్యర్థులు

వార్డు అభ్యర్థులకు నోటాతో కలిపి 21 గుర్తులు ఉంటాయి. వాటిని తెల్లరంగు (వైట్‌) బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రిస్తారు. గౌను, గ్యాస్‌ పొయ్యి, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, ఈల, కుండ, డిష్‌ ఆంటినా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్‌, గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవరు, హాకీ కర్ర బంతి, నెక్‌టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కేటిల్‌ వంటివి ఉన్నాయి. గుర్తుల కేటాయింపు పూర్తయిన వెంటనే, పోలింగ్‌ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు.

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు1
1/5

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు2
2/5

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు3
3/5

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు4
4/5

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు5
5/5

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు, అత్తాకోడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement