బగారా తిని మూడు మేకలు మృతి
వాంకిడి: మేతకు తీసుకెళ్తున్న క్రమంలో బయట పడేసి ఉన్న బగారా అన్నం తిని మూడు మేకలు మృతి చెందగా సుమారు 20 అస్వస్థతకు గురైన ఘ టన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు గొర్రెల కాపరి రమే శ్ మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని పలువురికి చెందిన మేకలను మేతకు తీసుకెళ్తుండగా చికెన్ సెంటర్ సమీపంలో పడేసి ఉన్న బగారా అన్నం తిని అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన కాపరి అప్రమత్తమై వెంటనే మేకల మందను స మీపంలో ఉన్న పశు వైద్యశాలకు తరలించగా వై ద్యులు యాంటిడోస్ టీకాలు వేశారు. దేశవేణి రమే శ్, నవ్‌గడె చందు, శ్రావణ్‌కు చెందిన మేకలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందగా సుమారు 20 మేకలు చికిత్స అనంతరం కొంతవరకు కోలుకున్నాయి.
విష ప్రయోగం వల్లే ప్రమాదం..
పడేసిన అన్నంపై విష ప్రయోగం చేయడం వల్లే మేకలు మృత్యువాత పడ్డాయని బాధితులు ఆరోపించారు. పడేసి ఉన్న ఆహారం తినడం వల్లే మేకలకు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


