ప్రహరీ కూల్చివేసిన ముగ్గురిపై కేసు
రామకృష్ణాపూర్: మందమర్రిలోని లక్ష్మీభవాని కాలనీలో ఓ ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన స్థల విషయంలో కోర్టులో స్టే ఉండగా మంగళవారం ప్రహరీని కూల్చివేసేందుకు ప్రయత్నించిన ఘటన చర్చానీయాంశమైంది. ఊరు మందమర్రికి చెందిన నర్సి ంగరావు పేరిట 421 సర్వే నంబర్‌లో కొంత భూమి ఉంది. అందులో చాలా రోజుల క్రితం బైర్నేని లక్ష్మి ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. దీంతో నర్సింగరావు కోర్టును ఆశ్రయించగా ఫంక్షన్‌హాల్ కూల్చివేతకు ఉత్తర్వులిచ్చింది. తీర్పును బైర్నేని లక్ష్మి కూడా సవాల్ చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఆర్డర్ ఉండగా నర్సింగరావు కుమారుడు పవన్‌రావు జేసీబీలతో వచ్చి ప్రహరీని కూల్చివేశారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ జేసీబీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పవన్‌రావుతో పాటు ప్రసన్న, సోనుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


