పోలింగ్ కేంద్రాల పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి, దొనబండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు చర్యలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాపల్లి, దొనబండ పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవి కాగా శాంతిభధ్రతల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్లు తెలి పారు. యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాల ని, క్షణికావేశాలతో గొడవల్లో పడి జీవితాలను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఎస్సై స్వరూప్‌రాజ్, పంచాయతీ కార్యదర్శులున్నారు.
విద్యార్థులతో మాటామంతి..
దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించే క్రమంలో వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులను గమనించిన డీసీపీ భాస్క ర్ వారి వద్దకు వెళ్లారు. విద్యార్థులందరినీ పలకరిస్తూ భవిష్యత్‌లో ఏ ఉద్యోగం చేయాలని ఉందని తెలుసుకున్నారు. చదువులో కష్టంగా ఉన్న సబ్జెక్ట్‌లపై కూడా ఆరా తీశారు. కష్టపడి చదివితే తప్పకుండా రాణిస్తారని వారిలో చైతన్యం నింపారు.


