నేడు ఓసీ ఫేజ్–2 ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్–2 ఏర్పాటుకు బుధవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు ఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి అదనపు కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, సింగరేణి అధికారులు, యూనియన్ ప్రతినిధులు హాజరుకానున్నారు. 1,209 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ప్రాజె క్ట్ జీవితకాలం దాదాపు 18 ఏళ్లు కాగా, ఈ ఓసీ ద్వా రా 2.50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా యాంత్రీకరణ విధానంతో చేపట్టే ఓసీకి మొత్తం కావాల్సిన భూమి 1,209 హె క్టార్లు కాగా, ఇందులో అటవీభూమి 611 హెక్టార్లు, అటవీయేతర భూమి 597 హెక్టార్లు ఉంది. ఈ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి పునరావాసం లేకపోవటం విశేషం. ప్రాజెక్టు కోసం రూ.442.90 కోట్లు కే టాయించారు. ఈ ఓసీ ఏర్పాటు ద్వారా కొత్త ఉద్యో గ, అభివృద్ధి అవకాశాలు పెరగనున్నట్లు స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాభిప్రాయసేకరణలో స్థానికులు, సంఘాల ప్రతినిధులు, యూని యన్ నాయకులు పాల్గొని అభిప్రాయాలు తెలుపాలని ఏరియా జీఎం రాధాకృష్ణ సూచించారు.


