పథకాలకు ఆకర్షితులయ్యే కాంగ్రెస్‌లో చేరిక
చెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పే ర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రా మానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ స త్యగౌడ్, ఆయన అనుచరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
గ్రామాలవారీగా కసరత్తు
చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి చె న్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. స ర్పంచ్ అభ్యర్థుల ప్రకటనకు గ్రామాల వారీ గా కసరత్తు చేశారు. కొన్ని గ్రామాల్లో నాయకుల మధ్య సయోధ్య కుదరక తానే పేర్లు ఖ రారు చేస్తానని నాయకులకు వివరించారు.


