మల్యాలలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే
జన్నారం: ప్రజల మానసిక ఆరోగ్యస్థితి, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయి అంచనా, చికిత్స అంతరాల గుర్తింపునకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్, నిమ్హాన్స్ బెంగళూర్ ఆధ్వర్యంలో మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం సర్వే నిర్వహించారు. వైద్యులు వామన్ కులకర్ణి, సాయికృష్ణ తిక్కా ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.వినీల్, మెడికల్ ఆఫీసర్ ఉమాశ్రీ పర్యవేక్షించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. మానసిక సమస్యలపై 14416 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఎమ్‌ఎల్‌హెచ్‌పీ నవనీల, ఏఎన్‌ఎం పద్మ, ఆశ వర్కర్ తిరుమల, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


