ఎల్లారం శివారులో పులి
నెన్నెల: కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారులో నీలగిరి ప్లాంటేషన్ ప్రాంతంలో పులి వచ్చినట్లు తెలవడంతో కదలికను గమనించేందుకు అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రేంజ్ అధికారి దయాకర్ సిబ్బందితో కలిసి మంగళవారం పులి పాద ముద్రలు గుర్తించారు. పులి జాడ కోసం రంగపేట, గుండ్ల సోమారం, జోగాపూర్, చిత్తాపూర్ అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. పులి ఎటువైపు వెళ్లిందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎల్లారం వైపు నుంచి రంగపేట అటవీ ప్రాంతం వైపు వెళ్లిందా..? లేక.. ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందా? అని పరిశీలిస్తున్నారు. పులి పాదముద్రలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


