ప్రభుత్వాస్పత్రిలో వేసెక్టమీ శిబిరం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో మంగళవారం వేసెక్టమీ (కుటుంబ నియంత్రణ) శస్త్రచికిత్స శిబిరాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషులకు కోత, కుట్టు లేని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పురుషులకు వేసెక్టమీపై అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారులు అరుణశ్రీ, గోపీనాథ్, భగవతి, శ్రీమన్నారాయణ, డీపీహెచ్ కాంతారావు, ఎస్వో దామోదర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ప్రభు త్వ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


