నిబంధనలు అమలయ్యేనా?
1 నుంచి అమల్లోకి నూతన మద్యం పాలసీ బడి, గుడి, ఆస్పత్రుల జోన్లకు దూరంగా షాపులు ఏర్పాటు చేయాల్సిందే.. హైవేకు 500 మీటర్ల దూరం ఉండాలి అమలుపై సర్వత్రా అనుమానాలు
నస్పూర్/మంచిర్యాలక్రైం: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనుంది. 2025–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్‌శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో గ తంలో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ని ర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా? మా మూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది.
పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ప్రశాంతి హాస్పటల్ పక్కనే ఓ వైన్స్ కొనసాగుతోంది. కాలేజ్ రోడ్, హమాలివాడ, ఐబీ సమీపంలో లక్సెట్టిపేటరోడ్‌లో ఉన్న వైన్స్‌లు హాస్పటల్స్‌కు దగ్గరలోనే, రోడ్డుపక్కనే ఉన్నాయి. నస్పూర్ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలు ఉండగా ఆరు జాతీయ రహదా రికి ఆనుకుని ఉన్నాయి. సీసీసీలోని రాయల్ గార్డెన్ సమీపంలో స్కూల్స్ జోన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చే యాలని, ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
క్లస్టర్ తొలగింపుతో వ్యాపారుల్లో ఊరట...
ఈసారి పట్టణాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బడి, గుడి, హాస్పిటల్స్‌కు వంద మీటర్ల దూరం అనేది అమలులో ఉంది. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే, స్టేట్‌హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు.
నిబంధనల మేరకే..
మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. సమాచారం ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న ప్రైవేటు హాస్పటల్స్‌కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తాం.
– కేజీ నందగోపాల్,
జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి, మంచిర్యాల
నిబంధనలు అమలయ్యేనా?


