దండేపల్లి: నంబాల గ్రామానికి చెందిన శనిగారపు శేఖర్–రజిత దంపతులు. వారికి కుమారుడు, కూతురు మహన్విత(7) సంతానం. శేఖర్ మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. రజిత కూలీ పనులు చేస్తుంది. ఇద్దరూ తమ ఇద్దరి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న (సోమవారం) మహన్విత ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఆచూకీ కోసం గాలించారు. కూతురు తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు.
బావిలో శవమై..
కానీ అదృశ్యమైన మహన్విత గురువారం నంబాల గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. విషయం తెలిసిన వెంటన గ్రామస్తులతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బారీగా తరలివచ్చారు. బాలిక మృతిపై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను ఎవరో చంపి బావిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహసీనొద్దీన్, సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. క్లూస్‌టీంతో ఘటన స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
గ్రామంలో విషాదం..
మహన్విత ప్రాణాలతో కనిపిస్తుందనుకుంటే ఇలా గ్రామసమీపంలో వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో, అక్కడికి వచ్చిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలం వద్ద రోదించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
● మూడు రోజుల క్రితం అదృశ్యం ● ఇంటికి సమీపంలోని వ్యవసాయ


