పీఎస్సార్‌కు ఘన స్వాగతం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకు గురువారం మంచిర్యాలకు రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. నాయకులు ఘనస్వాగతం పలికి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. దసరా పండుగ వరకు మంచిర్యాలలో ఉన్న ఎమ్మెల్యే ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూర్‌కు వెళ్లిన ఆయన ఇటీవల హైదరాబాద్‌కు పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, విజయానికి చేపట్టాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.


