చెన్నూర్‌రూరల్: ఏటా వరికోతలు పూర్తికాగానే పొలంలో ఉండే వరికొయ్యలు, ఇతర మూ లా లకు రైతులు నిప్పుపెడుతుంటారు. దీంతో పంటచేనులో భూసారం బుగ్గిపాలవుతుందని వ్య వసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పొలాలను హార్వెస్టర్లతో కోయించడంతో వరిగడ్డి(పశుగ్రాసం)కొయ్యలు ఎక్కువ మొత్తంలో మిగిలి ఉంటున్నాయి. పొ లం పనులు మొదలు పెట్టే రైతులు వ్యర్థాలు ఉండకూడదని పంట మూలాలకు నిప్పంటించి మళ్లీ సాగుకు సిద్ధం అవుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతో వరి కోతల ప్రక్రియ చేపడుతుండటంతో ఎలాంటి కుదుళ్లు లేకుండా నేల మట్టంగా కోసేవారు. ప్రస్తుత తరుణంలో కూ లీల కొరత ఉండటంతో చిన్నపాటి రైతులు కూ డా యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతొ సుమారు అడుగు నుంచి అడుగున్నర మేర వరికొయ్యలు మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇ లాంటి చర్యలతో భూమిలో సారం తగ్గి పోవడమే కాకుండా, పంటకు మేలు చేసే క్రిములు కూడా పూర్తిగా నశించే పోయే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పుతో భూసారానికి ఎంత ముప్పు కలుగుతుందనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.
వరికొయ్యలు కాల్చొద్దు
కోతలు ముగిసిన తర్వాత వరి కుదుళ్లను దుక్కిలో కలిపి దున్నితే భూసార విలువలు పెరుగుతాయి. నిప్పు పెడితే భూసారం దెబ్బతింటుంది. దున్నే ముందు నీటితడులు అందించి భూమి నానిన తర్వాత అందులోనే కలియ దున్నితే భూమిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. అలాగే పొలంలో జీలుగ పంట వేసి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగ పడుతుంది.
– బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్
నిప్పు.. భూసారానికి ముప్పు


