విద్యుత్ షాక్‌తో బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి
నార్నూర్: విద్యుత్ షాక్‌తో బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కాంబ్లె హన్మంతు (37) గురువారం ఉదయం ఇంట్లో బట్టలు సర్దుతుండగా విద్యుత్ తీగలకు చేయి తగలడంతో షాక్‌కు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
జాగృతి యాత్రకు ఎంపిక
బాసర: జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహోన్నత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా యువత కోసం ఉద్దేశించబడిన యాత్రలో ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న జశ్వంత్‌కు చోటు దక్కింది. కేవలం 15 రోజులలో దేశం మొత్తం చుట్టివచ్చే ఈ రైలుయాత్రలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు వారికి మార్గ నిర్దేశం చేస్తారు. సాధారణంగా 21 ఏళ్ల పైబడిన వారే ఈ యాత్రకు అర్హులైనప్పటికీ 18 ఏళ్ల జశ్వంత్ తన ప్రతిభతో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ విద్యార్థిని అభినందించారు.
విద్యుత్ షాక్‌తో బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి


