మొదటి ఘట్టం షురూ
● మొదలైన తొలి విడత ఎన్నికల షెడ్యూల్
● సర్పంచ్ స్థానాలకు 25 నామినేషన్ల దాఖలు
● వార్డు సభ్యుల స్థానాలకు 14 ● హాజీపూర్ మండలం నాలుగు సర్పంచ్, 2 వార్డుల సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. హాజీపూర్ సర్పంచ్ స్థానానికి శ్రీలత, వెంకటరమణారావు, దొనబండ సర్పంచ్ స్థానానికి బేతు రమాదేవి, పెద్దంపేట సర్పంచ్ స్థానానికి జాడి వెంకటేశ్ నామినేషన్ వేశారు.
● జన్నారం మండలంలో మొదటి రోజు 11మంది సర్పంచ్, ముగ్గురు వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేశారని ఎంపీడీవో ఉమర్‌షరీఫ్ తెలిపారు. చింతగూడ నుంచి ఇద్దరు, మహ్మదబాద్, పొనకల్, బాదంపల్లి, కామన్‌పల్లి, కవ్వాల్, రాంపూర్, రేండ్లగూడ, బంగారుతాండ, దేవునిగూడ గ్రామాల నుంచి ఒక్కొక్కరు నామినేషన్ వేశారు. మండలంలోని పొనకల్, తపాలపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు పరిశీలించారు. పొనకల్ నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లు, నామినేషన్ పత్రాల పంపిణీపై తెలుసుకున్నారు. అనంతరం చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ పాయింట్‌ను పరిశీలించారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్ పాల్గొన్నారు.
● లక్సెట్టిపేట మండలంలో ఒక్కటే నామినేషన్ దాఖలైంది. గుల్లకోట గ్రామ సర్పంచ్ స్థానానికి దేవి భీమయ్య నామినేషన్ వేశారని ఎంపీడీవో సరోజ తెలిపారు.
● దండేపల్లి మండలంలో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 9 మంది, వార్డు స్థానాలకు 9 మంది నామినేషన్లు వేశారు. తాళ్లపేట, మాకులపేట, నాగసముద్రం, మేదరిపేట, మామిడిపల్లి, వెల్గ నూర్, కాసిపేట, నంబాల, చింపల్లి గ్రామాల నుండి సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. కొర్విచెల్మ, పెద్దపేట, ద్వారక నామినేషన్ కేంద్రాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేకాధికారి దుర్గప్రసాద్, తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రాసద్ సందర్శించి నామినేషన్ల స్వీకరణ పరిశీలించారు.
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం/లక్సెట్టిపేట/దండేపల్లి: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. పంచాయతీ పోరులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు స్థానాలు ఉండగా.. నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 25, వార్డు సభ్యుల స్థానాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండలాల్లోని నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ స్వీకరణ ఈ నెల 29 వరకు సాగనుంది. డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో 1,28,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సందర్శించిన డీసీపీ, ఆర్డీఓ హాజీపూర్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్డీఓ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. బందోబస్తు, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ిసీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్‌కు సూచించారు.
నామినేషన్ల దాఖలు వివరాలు..
మండలం పంచాయతీలు సర్పంచ్ వార్డులు వార్డు సభ్యుల
నామినేషన్లు నామినేషన్లు
దండేపల్లి 31 09 278 09
హాజీపూర్ 12 04 106 02
జన్నారం 29 11 272 03
లక్సెట్టిపేట 18 01 160 –
మొత్తం 90 25 816 14
1/3
మొదటి ఘట్టం షురూ
2/3
మొదటి ఘట్టం షురూ
3/3
మొదటి ఘట్టం షురూ