సమస్యలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ● తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, పట్టా రద్దు చేసి న్యాయం చేయాలని కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన షేక్‌బాబర్ ఫిర్యాదు చేశాడు.
● మంచిర్యాలలోని గర్మిళ్ల శివారులో ఉన్న తన భూమి వద్దకు రాకుండా కొందరు దౌర్జన్యం చేస్తున్నారని, సర్వే జరిపించి న్యాయం చేయాలని మంచిర్యాలకు చెందిన భూక్య గోపాల్‌సింగ్ విన్నవించాడు.
● జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామ డీసీఎంఎస్–1 సెంటర్‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, రూ.1.40 కోట్లు అవకతవకలు జరిగాయని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు శివారెడ్డి, సత్యనారాయణరెడ్డి కోరారు.
● మంచిర్యాల శ్రీనివాస గార్డెన్ సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు మృత్యువాత పడ్డారని, ప్రమాదాలు జరుగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు రాజ్‌కుమార్, నవీన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
నస్పూర్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సో మవారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలి సి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమని ఇందారంలోని ఇసుక రీచ్‌లో పలువురు ఇసుక తీసుకెళ్లి ప్రైవేటు వెంచర్లు, ఇతర ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఇసుక తరలించే మేము ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలి.
– వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, సందీప్,
ఆన్‌లైన్ ఇసుక ట్రాక్టర్ నిర్వాహకులు, ఇందారం
1/1
సమస్యలు పరిష్కరించాలి