కడెం కాలువకు గండి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని కడెం 42 డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి పడింది. దీంతో పెద్దంపేట శివారులోని వరి పంటపొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలన్నీ నీటితో నిండి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, వరికోత మిషన్లు రాకుండా అయ్యాయి. దాదాపు 150 ఎకరాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చాలని కోరుతున్నారు. కాగా, కడెం గేటుకు కర్ర మొద్దు అడ్డుపడడం వల్ల నాలుగు రోజులుగా గేటు మూసి వేయలేకపోతున్నామని, ఆ కర్ర మొద్దు బయటకు వస్తే నీరు నిలుపుదల అవుతుందని కడెం అధికారులు తెలిపారు.


