వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి
నస్పూర్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 60ఏళ్లు నిండిన, అనారో గ్యంతో బాధపడుతున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సి ంగ్ కార్మికుల వారసులకు వారసత్వ ఉద్యోగా లు కల్పించాలని జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.సోహెల్‌ఖాన్, నస్పూర్ అధ్యక్షుడు కొయ్యల వెంకటి, నాయకులు పులి రాజేందర్, శ్రీనివాస్, మహేశ్, సుదాకర్, దుర్గమ్మ, రజిత, పద్మ, రమ, తదితరులు పాల్గొన్నారు.


